Site icon NTV Telugu

Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వచ్చేసింది..

Music

Music

ఈరోజుల్లో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, గామి ఫేమ్ చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమా రాబోతుంది.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది.

ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్‌ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అనే పాటను విడుదల చేశారు.. అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి..

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పవన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు..

Exit mobile version