Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి ఏకాదశి పండుగ కోసం ట్రైన్ లో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫోన్ ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి మరణించాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. వ్యవసాయదారులైన రాములు దంపతులు కష్టపడి శ్రీకాంత్ ను చదివిపించారు.
Read Also: Health Tips: ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
అయితే.. వారు అనుకున్నట్లుగానే శ్రీకాంత్ చదువు పూర్తి చేసి హైదరాబాద్ ఇన్పోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాబ్ సంపాదించాడు. హైదరాబాద్ లోనే ఉంటున్న శ్రీకాంత్ తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ నుంచి శాతవాహన ఎక్స్ ప్రెస్ లో ఖాజీపేటకు బయలు దేరి వెళ్లాడు. ట్రైన్ లో రష్ ఎక్కువగా ఉండడంతో డోర్ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. బీబీనగర్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిని కర్రతో కొట్టారు. దీంతో కింద పడబోతున్న ఫోన్ ను పట్టుకోబోయిన శ్రీకాంత్ రైలులో నుంచి కింద జారీపడి తీవ్ర గాయాలతో చనిపోయాడు.
Read Also: Madonna Hospitalized: అనారోగ్యంతో ఆస్పత్రి ICUలో చేరిన అమెరికన్ సింగర్ మడోన్నా
ఈ ఘటన నిన్న ( బుధవారం ) సాయంత్రం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ ఫోన్ ను కర్రతో కొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రైన్ లలో ప్రయాణిస్తున్నడు తరుచు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రైలు డోర్ దగ్గర కూర్చొకూడదని రైల్వే అధికారులు వెల్లడిస్తున్న ప్రయాణికులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!