NTV Telugu Site icon

Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి

Train Accident

Train Accident

తొలి ఏకాదశి పండుగ కోసం ట్రైన్ లో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫోన్ ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి మరణించాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ ​మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. వ్యవసాయదారులైన రాములు దంపతులు కష్టపడి శ్రీకాంత్ ​ను చదివిపించారు.

Read Also: Health Tips: ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అయితే.. వారు అనుకున్నట్లుగానే శ్రీకాంత్ చదువు పూర్తి చేసి హైదరాబాద్​ ఇన్పోసిస్ ​లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాబ్ సంపాదించాడు. హైదరాబాద్ లోనే ఉంటున్న శ్రీకాంత్​ తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ ​నుంచి​ శాతవాహన ఎక్స్ ప్రెస్ లో ఖాజీపేటకు బయలు దేరి వెళ్లాడు. ట్రైన్ లో రష్ ​ఎక్కువగా ఉండడంతో డోర్​ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్​ చూస్తున్నాడు. బీబీనగర్ ​రైల్వేస్టేషన్ ​దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిని కర్రతో కొట్టారు. దీంతో కింద పడబోతున్న ఫోన్ ​ను పట్టుకోబోయిన శ్రీకాంత్​ రైలులో నుంచి కింద జారీపడి తీవ్ర గాయాలతో చనిపోయాడు.

Read Also: Madonna Hospitalized: అనారోగ్యంతో ఆస్పత్రి ICUలో చేరిన అమెరికన్ సింగర్ మడోన్నా

ఈ ఘటన నిన్న ( బుధవారం ) సాయంత్రం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ ఫోన్ ను కర్రతో కొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రైన్ లలో ప్రయాణిస్తున్నడు తరుచు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రైలు డోర్ దగ్గర కూర్చొకూడదని రైల్వే అధికారులు వెల్లడిస్తున్న ప్రయాణికులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.