వంద కోట్లు అంటే కేవలం స్టార్ హీరోలకు సాధ్యం.. కానీ మాలీవుడ్‌లో ఈ లెక్కలు డిఫరెంట్. కంటెంట్ ఉంటే చాలు స్టార్ హీరో లేకపోయినా.? ఎలివేషన్స్ సీన్స్ లేకున్నా? భారీ వీఎఫ్ఎక్స్ ఉండకపోయినా నడిచేస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వజా2. టైర్1, టైర్2 హీరోలు లేరిక్కడ అంతా కొత్త వాళ్లే అయినా మాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. గత వారం రిలీజైన ఈ సినిమా వన్ వీక్‌లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది.
Also Read : Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?
2024లో వచ్చిన వజాకు సీక్వెల్‌గా వచ్చింది వజా2. వజా అంటే మలయాళంలో యూస్ లెస్ అని అర్థం. సేమ్ రెండు సినిమాల స్టోరీనే కూడా ఇలాగే డిజైన్ చేశాడు ప్రముఖ డైరెక్టర్ విపిన్ దాస్. జయ జయ జయహే, గురువాయర్ అంబలనడయిల్ లాంటి సినిమాలను అందించిన విపిన్ ఈ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వజా2కి వన్ ఆప్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహూ గార్లపాటి ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ కొట్టిన సాహు మలయాళంలో మరో హిట్ నమోదు చేశారు. అలాగే మలయాళంలో ఆయనకు ఇది సెకండ్ సక్సెస్. వజాను ఆనంద్ మీనన్ డైరెక్ట్ చేస్తే పార్ట్ 2ని సవిన్ ఎస్ఎ డీల్ చేశాడు. పదికోట్లతో తెరకెక్కించిన వజా2 ఈ ఏడాది సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. వెస్ట్ ఫెలోస్‌గా ముద్రపడ్డ నాలుగు కుర్రాళ్ల కథను ఫన్, లవ్ అండ్ ఎమోషన్ జోడించాడు దర్శకుడు. ఫ్లాట్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ఆ ఫోర్ బాయ్స్ క్యారెక్టర్స్‌ను ఎక్కడో ఒక చోట ఆడియన్స్ తమ లైఫ్‌కు కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ న్యాచురాలిటీ సినిమాకు ప్లస్సై.. కాసుల వర్షం కురిపిస్తోంది.
