London: 2022లో ఇంగ్లండ్‌లో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌కు చెల్లింపుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్‌లో జరిగిన ఈ హత్యకేసు నిందితుడికి శిక్ష పడింది. టాక్సీ డ్రైవర్ పేరు అంఖ్ సింగ్ (59). టోమాజ్ మార్గోల్ (36) అనే వ్యక్తి హత్య చేసి దోషిగా నిర్ధారించబడ్డాడు. సింగ్ హత్యకు సంబంధించి అతను ఈ వారం వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. దీంతో దోషికి వచ్చే నెలలో శిక్ష పడనుంది. వోల్వర్‌హాంప్టన్ పోలీస్ CIDకి చెందిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI) మిచెల్ థుర్‌గూడ్ మాట్లాడుతూ.. ఈ రకమైన హింస చాలా విచారకరమని అన్నారు. ఇది ఖచ్చితంగా అర్ధంలేనిదని ఆరోపించారు. సింగ్ తన పనిని తాను చేసుకునేవాడని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని తెలిపాడు. అక్టోబర్ 30, 2022 ఉదయం అంఖ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని.. కొంత సమయం తర్వాత అతను మరణించాడని కోర్టుకు తెలిపారు.
Read Also: AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SSC బోర్డులో ఉద్యోగాలు..
అయితే హత్యకు గల కారణాలేంటంటే.. అంఖ్ సింగ్ మార్గోల్ అనే వ్యక్తిని తన టాక్సీలో తీసుకువెళ్తున్నాడు. అయితే ట్యాక్సీ డబ్బులు ఇవ్వాలని సింగ్ అడగ్గా.. అందులో ప్రయాణిస్తున్న యువకుడు వాదించడం ప్రారంభించాడు. చెల్లింపు విధానం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. మార్గోల్ సింగ్‌పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మార్గోల్ సింగ్ తలపై కొట్టడంతో నేలమీద పడిపోయాడని.. అంతేకాకుండా కాళ్లతో తన్నాడు. దీంతో అప్పటికే సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత కాసేపటికి మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుడు మార్గోల్‌గా గుర్తించారు. తర్వాత అతని అడ్రస్ ను కనుగొని.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడు పోలీసుల ఎదుట నిజాలు బయటపెట్టాడు.