Site icon NTV Telugu

Lokesh Kanagaraj : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై షార్ట్ ఫిల్మ్..

Whatsapp Image 2024 05 19 At 10.23.25 Am

Whatsapp Image 2024 05 19 At 10.23.25 Am

Lokesh Kanagaraj : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు లోకేష్ కనగరాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన టేకింగ్ తో సినిమాలను తెరకెక్కిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక సినిమాకు ఇంకో సినిమాను లింక్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.భారీగా కలెక్షన్స్ కూడా సాధించి పెట్టాయి.దీనితో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా మారారు.ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో లోకేష్ ఎంతో బిజీ గా వున్నాడు.

ఇదిలా ఉంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ రాబోతుందని సమాచారం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అస్సలు ఎలా మొదలైంది దాని గురించి పూర్తిగా వివరిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందుతుంది.అయితే
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తిచేశారని తెలుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అర్జున్ దాస్, నరేన్ మరియు కాళిదాస్ జయరామ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ షార్ట్ ఫిలింకు తమిళ్ లో ‘పిళ్లైయార్ సుజి’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.త్వరలోనే దర్శకుడు లోకేష్ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

Exit mobile version