Site icon NTV Telugu

Plane Crash: విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన.. చివరకి..?

Mergedimages

Mergedimages

ఇదివరకు చాలా మందికి విమాన ప్రయాణం అంతే పెద్ద సంగతిగా భావించేవారు. కాకపోతే ఇప్పుడు మానవ జీవిత ప్రమాణాలు పెరగడంతో ఈ విషయం కాస్త కామన్ గా మారింది. అయితే చాలా మందికి విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. అదే ఒకవేళ టైం బాగోలేకపోతే మాత్రం అంతే స్థాయిలో విషాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ వల్ల గాల్లోకి వెళ్లిన విమానం పేలడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు అదృష్టవశాత్తూ.. అంతా క్షేమంగా బయటపడుతుంటారు.

Also Read: MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?

ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇక తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఓ విమానం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు గాల్లో వెళ్తున్న విమానం వేగంగా భూమి మీదకు రావడం గమనించారు. అందులో కొంతమంది తమ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ విమానాన్ని వీడియో తీస్తున్నారు. అలా అందరూ చూస్తుండగానే విమానం అత్యంత వేగంగా భూమి పైకి వచ్చేసింది. ఈ సమయంలో కొద్ది సేపట్లో విమానం భూమిని ఢీకొంటుందనగా.. విమానం లోనుంచి చాలా మంది పారాచ్యూట్‌ల సాయంతో విమానం నుండి దూకేశారు. వారు అలా దుకారో లేదో విమానం నేలను బలంగా గుద్దుకొని పేలిపోయింది. ఈ దెబ్బకి పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మంటలు, పొగ వ్యాపించాయి.

Also Read: Baby Girl Born: అమానుషం.. మూడోసారీ కూడా ఆడబిడ్డే పుట్టడంతో.. పాపని పొలాల్లో విసిరేసిన తల్లి..!

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు అరుపులు, కేకలు వేయడం మొదలు పెట్టారు. కాకపోతే ప్రయాణికులు మాత్రం పారాచ్యూట్‌ ల సాహయంతో క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా.. దేవుడా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Exit mobile version