NTV Telugu Site icon

Sarfaraz Khan: దిగ్గజ ఆటగాళ్లు సాధించలేని రికార్డును సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ!

Sarfaraz Khan

Sarfaraz Khan

Sarfaraz Khan: అరంగేట్ర సిరీస్ లోనే ఇంగ్లాండ్ ఆటగాళ్ల గుండెల్లో భయం సృష్టించిన సర్ఫరాజ్., ఇప్పుడు ఇరానీ కప్‌లో తెగ పరుగులు చేస్తున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇరానీ కప్‌లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా సాధించలేని ఈ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ సృష్టించాడు.

Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?

ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 2024 ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ముంబై మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫైనల్ రెండో రోజున సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. విశేషమేమిటంటే.. ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తొందరగానే ఔటైన తర్వాత అజింక్య రహానేతో కలిసి సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రహానే తన డిఫెన్సివ్ స్టైల్‌లో ఆడుతుండగా, సర్ఫరాజ్ మరో ఎండ్ నుంచి దూకుడు ప్రదర్శించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Viral Video: అర్థరాత్రి ప్రయాణం బీకేర్ ఫుల్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని వెంబడించిన బైకర్స్(వీడియో)

సర్ఫరాజ్‌కి తనుష్ కోటియన్ నుండి మంచి మద్దతు లభించింది. వీరిద్దరూ కలిసి ముంబై స్కోరును 280/6 నుంచి 460కి తీసుకెళ్లారు. సర్ఫరాజ్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కొనసాగించి చివరి సెషన్‌లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ 253 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గతంలో ముంబై బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 1972లో ఆర్‌డి పార్కర్ చేసిన 195 పరుగులు. దానిని సర్ఫరాజ్ ఖాన్ బ్రేక్ చేశాడు. రోజు ఆట ముగిసే వరకు సర్ఫరాజ్ 221 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. మొత్తానికి ముంబై 537 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

Show comments