Site icon NTV Telugu

Malladi Vishnu: బెజవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకి ఇవ్వాలని పలువురు నేతల రహస్య భేటీ

Malladhi Vishnu

Malladhi Vishnu

బెజవాడ సెంట్రల్ సీటు మళ్లీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఇవ్వాలని నియోజక వర్గ నేతల అంతర్గత సమావేశం అయ్యారు. పున్నమి రిసార్ట్ లో నిన్న 14 మంది కార్పొరేటర్లు, 4 ఇంఛార్జ్ లతో కలిసి భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. జానారెడ్డి, అవుతు శైలజారెడ్డి సమావేశానికి దూరంగా ఉండిపోయారు. మిమ్మల్ని నమ్మి కార్పొరేటర్ సీట్లు ఇచ్చానని ఎమ్మెల్యే మల్లాది చెప్పారు.

Read Also: Viral Video: కదులుతున్న కారుపై నిద్రిస్తున్న పిల్లలు.. డైవర్ పై మండిపడుతున్న నెటిజన్లు..

కార్పొరేటర్లలో కొందరు నాకు సీటు ఇవ్వొద్దని సీటు లేదని ప్రచారం చేసారని చెప్పి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదనకు గురైనట్టు సమాచారం. బాధతో తానే పోటీ చేయను అని మల్లాది సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. పోటీ చేయాలని కోరుతూ కార్పొరేటర్లు తీర్మానం చేస్తున్నారు. ఇవాళ మీడియా ముఖంగా ప్రెస్ మీట్ నిర్వహించి మరోసారి ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వాలని కొందరు కార్పొరేటర్లు కోరుతున్నారు.

Exit mobile version