Scooty Running Without Rider: సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ఆ తర్వాత వివిధ రకాల వీడియోలు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే, మనం ఇప్పటివరకు డ్రైవర్ లెస్ కారును చూశాము. టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను తీసుకురాగా.. ఇప్పుడు అనేక కంపెనీలు ఇలాంటి డ్రైవర్ లెస్ కార్లపై దృష్టి సాధించాయి. ఇది ఇలా ఉండగా.. మరోవైపు, డ్రైవర్ లెస్ స్కూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: WI vs BAN: 5 పరుగులు, నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బౌలర్..!
Read also: Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే.. ఓ స్కూటీకి ఎర్రటి క్లాత్ పై చైనా భాషలో రాసి ఉన్న జెండాను తగిలించారు. ఆ స్కూటీ రోడ్డుపై నుంచి షో రూమ్ కి ఎటువంటి వాహనచోదకుడు లేకపోయినా అదంతకు అదే రావడం మనం గమనించవచ్చు. అలా షోరూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత దాని పార్కింగ్ కోసం ముందుకు వెనకకు వెళ్లడం మనం గమనించవచ్చు. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాను ఇప్పటివరకు ఇలాంటి స్కూటీ చూడలేదని కొందరు కామెంట్ చేస్తుంటే.. అరెరే, ఇదేదో భలే ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించి మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.