Site icon NTV Telugu

School Bus: హైదరాబాద్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. అదుపుతప్పి చెట్ల పొదల్లోకి

School Bus

School Bus

పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లోకి పాఠశాల బస్సు వేగంగా దూసుకెళ్లడంతో విద్యార్థులు భయాందోళన గురయ్యారు. డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో రోడ్డు దాటి అదుపుతప్పి చెట్లలోకి పాఠశాల బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాగా స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను బస్సులో నుండి బయటకు దింపి రక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version