NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‌లోని ఓ స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెద్ద ముప్పు

School Bus

School Bus

గుజరాత్‌లో (Gujarat) ఓ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో విద్యార్థులతో కలిసి టీచర్లు విహారయాత్రకు వెళ్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు.. విద్యార్థులను కిందకి దింపేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అందరూ క్షేమంగా బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని సిల్వాస్సా నుంచి ఓ స్కూల్ బస్సు (School Bus) బయల్దేరింది. 30 మంది విద్యార్థులు.. ముగ్గురు టీచర్లు పిక్నిక్‌కి బయల్దేరారు. వల్సాద్‌లోని ధరంపూర్-విల్సన్‌హిల్స్ మార్గంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తం కావడంతో విద్యార్థులు, టీచర్లు వెంటనే కిందకి దిగిపోయారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.