మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి హత్యయత్నం చేసిన నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తుండగా.. గడ్డం రాజు అనే వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కలవడానికి దగ్గరికి వచ్చి కత్తితో పొడిచి హత్యయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తెరుకొని పై నిందితున్ని పోలీసులకు అప్పగించినారు. అయితే, ప్రస్తుతం నిందితుడు రాజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అక్కడ.. చికిత్స చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హత్యయత్నం చేసిన గడ్డం రాజుపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.
Read also: Bigg Boss Telugu 7: మారని శోభా తీరు… అర్జున్ పై రెచ్చిపోయిన లేడీ విలన్..
అయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి బలమైన గాయం అయింది. కత్తి పోటు మూడు ఇంచులు లోపలికి దిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ లోకి వైద్యలు తీసుకెళ్లారు. కాసేపట్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రిలో సర్జరీ జరుగనుంది. ఇక, విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. అలాగే, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు
యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.