NTV Telugu Site icon

Whats up: వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేస్తే అకౌంట్ బ్లాక్

Whatsapp 10

Whatsapp 10

వాట్సప్.. స్మార్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం ఉన్న ఓ మెసేంజర్ యాప్. కొందరు ఈ వాట్సప్ లో నిత్యం మునిగి తేలుతుంటారు. రోజంతా చాటింగ్లు చేస్తూ గడిపేస్తుంటారు. అయితే ఎక్కువ సమయం వాట్సప్ లో గడిపేవారికి చేదు వార్త.. అదేంటంటే వాట్సప్ త్వరలో మరో కొత్త ఫీచర్ తో ముందుకు రానుంది. ఇక ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు చేస్తే సహించేందుకు కుదరదు. వాట్సప్ నిబంధనలకు వ్యతిరేకంగా మెసేజ్ లు పంపితే.. ఆ అకౌంట్ ను కొన్ని రోజులు బ్లాక్ చేస్తుందట. అయితే ఈ ఫీచర్ కేవలం కొత్త చాట్స్ చేయకుండా మాత్రమే ఆపుతోందని.. పాత చాట్స్ కంటిన్యూ చేయవచ్చని అంటున్నారు.

READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై కీలక పరిణామం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈ కొత్త ఫీచర్ గురించి వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాట్సప్ నిబంధనలను ఎవ్వరూ లెక్కచేయట్లేదు. అసలు వాట్సప్ కు నిబంధనలు ఉన్నాయన్న విషయాన్నే మర్చిపోయారు. తమకు ఇష్టం వచ్చినట్లు మెజేజ్లు చేస్తూ.. అతి చేస్తుంటారు. గత కొంత కాలం నుంచి స్పామ్ మెజేజ్లు సైతం ఫార్వర్డు అవుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వినియోగదారులను సేవ్ చేయడానికే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పూర్తిగా తప్పించకుండా.. తాత్కాలికంగా బ్లాక్ చేయనున్నారు. అంతే కాకుండా ఏ కారణంగా వారి అకౌంట్ బ్లాక్ చేయబడిందో అనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయనుంది వాట్సప్. తాత్కాలికంగా బ్యాన్ చేసిన వాట్సప్ హిస్టరీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కొత్త ఫీచర్ అకౌంట్ ను కాకుండా చాట్స్ ను మాత్రమే చేయకుండా అడ్డుకుంటుందని వివరించింది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వచ్చిన వెంటనే అది వినియోగదారులకు అర్థమచయ్యేలా పాప్ అప్ మెసేజ్ బ్లింక్ అవుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు చేయబడిందని సంస్థ చెప్పింది. ఈ ఫీచర్ ద్వారా ఇక వినియోగదారులకు ప్రొటెస్ట్ పెరుగుతుందని స్పష్టం చేసింది.