NTV Telugu Site icon

ICC Chairman Jay Shah: నేటి నుంచే ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్న జై షా

Icc

Icc

ICC Chairman Jay Shah: జై షా 2009 నుండే ప్రత్యక్షంగా క్రికెట్ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2009లో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన పదవీకాలంలో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసాడు. ఆ తర్వాత 2019లో బీసీసీఐలోకి నేరుగా అడుగుపెట్టాడు. అలా బీసీసీఐలో తన పాత్రను అంచలంచలుగా పెంచుకుంటూ నేడు ఆయన ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్నాడు. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తర్వాత, జై షా తన కొత్త ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టబోతున్నాడు నేటి నుండి. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా తన పదవీకాలాన్ని మేటి నుండి (డిసెంబర్ 1)న ప్రారంభించారు. దీంతో 35 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన ఐసీసీ చైర్మన్‌గా జై షా నిలిచాడు. దీంతో ఐసీసీని పాలించిన 5వ భారతీయుడిగా జై షా నిలిచాడు. ఆయన కంటే ముందు కేవలం 4 మంది భారతీయులు మాత్రమే ఐసీసీ అధ్యక్ష పదవిని చెప్పటారు. ఆయనకు ముందు జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఈ బాధ్యతలను చేపట్టారు.

Also Read: IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ కాదు.. ఏ స్థానంలో ఆడనున్నాడంటే..?

మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీపై కొనసాగుతున్న వివాదాల మధ్య జై షా ఐసీసీ ఛైర్‌ను అధిష్టించాడు. దింతో ఇప్పుడు ఈ టోర్నమెంట్‌పై తీసుకున్న నిర్ణయాలలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఇక నేడు ఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న జై షా తన పదవీకాలంపై మాట్లాడుతూ.. ఐసిసి అధ్యక్షుడి పాత్రను స్వీకరించడం నాకు గౌరవంగా ఉందని, ఐసిసి డైరెక్టర్లు ఇంకా మెంబర్ బోర్డ్‌ల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఆకర్షణీయంగా ఉండేలా కృషి చేసేందుకు, అలాగే లాస్ ఏంజెల్స్ 2028 లో జరగబోయే ఒలంపిక్ క్రీడలకు సిద్ధమవుతామని తెలిపారు. 2028లో జరగబోయే ఒలంపిక్ క్రీడలలో జగబోయే క్రీడలలో క్రికెట్ భాగం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలుపుకుపోతామని ఆయన ఆశ భావం వ్యక్తం చేశాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల విభిన్న ఫార్మేట్ లను, అలాగే మహిళల క్రికెట్ అభివృద్ధి సంబంధించి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.