Site icon NTV Telugu

Cricket Stadium: ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్‌లో తప్పిన ప్రమాదం.. ఊడిపడిన భారీ బోర్డు

Luknow

Luknow

Cricket Stadium: వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌ ఈ రోజు లక్నోలో జరుగుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం, తుపాన్ వచ్చింది. దీంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడిపోయింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అక్కడ ప్రేక్షకులు తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.

Read Also: World Cup Records: ఇంగ్లండ్ను స్పిన్ తిప్పేస్తోందా..!

ఇదిలా ఉంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంతసేపు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వర్షం ముగిసాక తిరిగి ఆట ప్రారంభమైంది. మళ్లీ శ్రీలంక ఇన్నింగ్స్ అయిపోయాక కూడా కొద్దిసేపు వర్షం కురిసింది. ఎట్టకేలకు వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది.

Read Also: Mama Mascheendra : రెండు ఓటీటీ లలోకి రాబోతున్న మామా మామా మశ్చీంద్ర..

Exit mobile version