Site icon NTV Telugu

Indian MBBS Student: వియత్నాంలో తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మృతి..!

Accident

Accident

Indian MBBS Student: ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్‌గా అక్కడి అధికారులు గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో అర్షిద్ నడిపిన బైకు వేగంగా రావడంతో అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది.

Read Also: Bengaluru Stampede: తొక్కిసలాట బాధితులలో చాలామంది డిశ్చార్జ్.. 14 ఏళ్ల బాలుడు ఇంకా అబ్జర్వేషన్‌లోనే..!

ఈ ప్రమాద సమయంలో అతనితోపాటు ఉన్న అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వేగంగా వెళుతుందని, అదుపుతప్పి నేరుగా గోడను ఢీకొనడంతో ఇద్దరూ పైకి ఎగిరి పడిన దృశ్యాలు దగ్గరలోని సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మొదట ఓ ప్రశ్నతంగా ఉన్న వీధి కనిపిస్తుంది. అలా ఉన్న సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బైకు గోడను చాలా గట్టిగా గుద్దుతుంది. ఢీకొట్టే వేగం ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఢీ కొట్టిన తర్వాత ఇద్దరూ గాల్లోకి ఎగిరిపోతూ కనిపించారు.

Read Also: Sharmishta Panoli: ఇన్‌ఫ్లుయెన్సర్‌ శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు..!

ఇకపోతే మృతి చెందిన అర్షిద్ తల్లిదండ్రులు అర్జున్, ప్రతిమలు ఆసిఫాబాద్‌లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు స్పందించారు. మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగంగా జరగాలంటూ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version