ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సిటీ సెంటర్ సమీపంలో హార్టికల్చర్ డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మొత్తం 15 ఫైరింజన్లు సంఘటన స్థలం మంటలు ఆర్పుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఈ మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. 3-4 గంటల్లో మంటలను ఆర్పివేస్తామని సీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ తెలిపారు.
నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 34లో ఉన్న చెత్త కుప్పలో మంటలు చెలరేగాయని తెలిపారు. కాలక్రమేణా మంటల తీవ్రత పెరిగిందన్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పారు. 15 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నాయని వెల్లడించారు. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుంది. చెత్తను కాల్చి వేయడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం.
#WATCH उत्तर प्रदेश: नोएडा सिटी सेंटर के पास हॉर्टिकल्चर डंपिंग यार्ड में आग लग गई। फायर टेंडर की गाड़ियां मौके पर मौजूद हैं। आग को बुझाने की कोशिश की जा रही है। pic.twitter.com/qUVRvYuhWn
— ANI_HindiNews (@AHindinews) March 25, 2024
#WATCH शाम 6 बजे आग लगने की सूचना मिली। आग काफी बड़ी है। मौके पर फायर टेंडर में 15 गाड़ियां मौजूद हैं। 3-4 घंटों में आग को बुझा देंगे: CFO प्रदीप कुमार https://t.co/IACGLLmnTT pic.twitter.com/pJCxIw0sRW
— ANI_HindiNews (@AHindinews) March 25, 2024
