NTV Telugu Site icon

Uttar Pradesh: మీరట్‌ రబ్బర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

Fie

Fie

ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రబ్బరు గోదాములో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం జరిగిందన్న విషయం ఇంకా బయటకు రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రబ్బరు గోదాం కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమీప ప్రాంతాలు పొగతో కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక సమీపంలోని నివాస గృహాలు ఉన్నాయి. అటువైపు కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కి భార్య క్రూరత్వం కారణంగా విడాకులు..