Partner Exchange : కొన్ని సంబంధాలు వింటుంటే వింతగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి అవసరాలే ఇలాంటి విచిత్ర బంధాలను సృష్టిస్తాయేమో.. బీహార్లో మాత్రం అలాగే జరిగింది. ఓ వివాహిత కట్టుకున్న భర్తను వదిలి ప్రియుడితో జంప్ అయింది. దీనికి కక్ష పెంచుకున్న భర్త ఆమె ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని ఖగాడియా జిల్లాలో వెలుగు చూసింది. ఖగాడియా జిల్లా చౌథమ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామంలో ముఖేశ్, నీరజ్ అనే ఇద్దరు నివసిస్తున్నారు. వీరికి వేర్వేరు మహిళలతో పెళ్లిళ్లు అయ్యాయి. కానీ నీరజ్ భార్య ముఖేశ్‌ను పెళ్లికి ముందే ప్రేమించింది. పెళ్లి అయిన తర్వాత కూడా ముఖేశ్‌తో సంబంధాన్ని కొనసాగించింది. అప్పటికే ముఖేశ్‌కు భార్య ముగ్గురు సంతానం. నీరజ్ కు నలుగురు సంతానం. అయినా ముఖేశ్, తన ప్రియురాలిని విడిచి ఉండలేకపోయాడు. ఆమె కూడా అతన్ని వదిలిపెట్టి ఉండలేకపోతోంది. దీంతో ముఖేశ్ తన ముగ్గురు పిల్లలను, ప్రియురాలిని తీసుకొని గతేడాది ఫిబ్రవరిలో ఇంటి నుంచి జంప్ అయ్యాడు. ఆ తర్వాత తన ప్రియురాలు రూబీని వివాహం చేసుకున్నాడు.
Read Also: Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
తన భార్య ముఖేశ్‌తో వెళ్లిపోవడాన్ని సహించని నీరజ్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, అక్కడ ఏమీ తేలక పోవడంతో గ్రామ పెద్దలను సంప్రదించాడు. దీంతో ముఖేశ్‌ను పిలిపించి గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. పంచాయితీలో తనకు ప్రియురాలే ముఖ్యం అని ముఖేశ్ తెగేసి చెప్పాడు. దీంతో నీరజ్ ముఖేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. ముఖేశ్ భార్యతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నీరజ్ ఆమెకు దగ్గరయ్యాడు. తన నలుగురి పిల్లల ఆలన పాలనా కోసం ముఖేశ్ భార్యను నీరజ్ వివాహం చేసుకున్నాడు. అయితే నీరజ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ముఖేశ్ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొత్తం ఈ కథలో నీరజ్, ముఖేష్ ఇద్దరి భార్యల పేర్లు రూబీ కావడం విశేషం.