NTV Telugu Site icon

Viral News: బెంగళూరు నగరంలో 13 గంటల్లో 73 కిలోమీటర్లు నడిచిన ఓ వ్యక్తి.. ఎందుకో తెలుసా..!

Bengaluru

Bengaluru

బెంగళూరులో ఓ వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను పట్టుకుని నగరం మొత్తం కలియతిరిగాడు. అంతేకాకుండా.. GPSని ఉపయోగిస్తూ ఇండియా మ్యాప్‌ను వెతుకుతూ నగరం అంతటా నడిచాడు. తాను నడుస్తు్న్న వీడియోను ట్విట్టర్(X) లో వికాస్ రూపరేలియా పోస్ట్ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ఐటీ సిటీ వీధుల్లో తాను నడుస్తున్న వీడియోను పంచుకున్నారు. అందులో అతను 13 గంటల 25 నిమిషాల్లో 73 కిలోమీటర్లు నడిచేటప్పుడు నగరంలో గుర్తించగలిగిన భారతదేశ మ్యాప్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు.

Read Also: Venu Tottempudi: ‘అతిథి’ గా వస్తున్న హీరో వేణు..

అంతేకాకుండా.. “బెంగళూరులో నడుస్తూ ఈ GPS కళ చేశారా, జై హింద్! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, మీ శుభాకాంక్షలకు మరియు ప్రేరణకు చాలా ధన్యవాదాలు ప్రియమైన మిత్రులారా, నేను దీన్ని ఒక్క రోజులో పూర్తి చేయగలనా అని నాకు వ్యక్తిగతంగా కూడా సందేహం కలిగింది. ఇది గొప్ప సాహసం మరియు నా కుటుంబం & స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు,” అని రాసుకొచ్చారు.

Read Also: Rachakonda CP: మీర్‌పేట్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు

అతని మార్గంలో సహాయం చేయడానికి స్ట్రావా అనే యాప్‌ని ఉపయోగించారు. ఈ వీడియోను కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి 7,100 కంటే ఎక్కువ మంది చూశారు. వందల కొద్దీ లైక్‌లు మరియు కామెంట్‌లు వచ్చాయి. సోషల్ మీడియా వినియోగదారులు అతని “స్పూర్తిదాయకమైన” ప్రయాణాన్ని ప్రశంసించారు. “అద్భుతం” అంటూ కామెంట్ చేశారు.