Money On Roads: ప్రస్తుత సమాజంలో మనిషి బయట ప్రజలతో మాట్లాడడం కంటే సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పుడు నుంచి అనేక సోషల్ మీడియా యాప్స్ వల్ల చాలామంది ఫోన్ కు అంకితం అయిపోతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలామంది యువత పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది వారి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రోడ్డుపై డబ్బులు పడవేసిన వీడియో ఇప్పుడు నెటింట వైరల్ గా మారింది. ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Gopichand: ఒక్క హిట్టు కూడా లేని ఫ్లాప్ దర్శకుడితో.. ఫ్లాప్ హీరో సినిమా..?
అందరిలాగే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మహానగరంలో ఓ వ్యక్తి ప్రధాన కూడళ్లలో డబ్బుల వర్షం కురిపిస్తున్నాడు. బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యక్తి వంద రూపాయల నోట్ల కట్టలు తీసుకొని అమాంతం గాలిలోకి ఎగిరివేయడం వీడియోలో గమనించవచ్చు. దాంతో అక్కడ ఉన్న ప్రజలు రోడ్డుపై వాహనాలు వెళ్తున్న ప్రమాదకరంగా నేలపై పడ్డ డబ్బులను ఏరుకున్నారు. Its_me_power_ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా కు సంబంధించిన వ్యక్తి పనిచేశాడు. హైదరాబాదులోని కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ లో డబ్బులు విసురుతూ రీల్స్ తీశాడు యూట్యూబర్. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.