A Man Sudden death In Marriage : అప్పటి వరకు అందరితో కలిసి ఆనందంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సడన్ గా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఏమైందా అని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు అనంతలోకాలకు వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాదకరమైన ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో చోటు చేసుకుంది. పాలి నగరంలోని మహాత్మా గాంధీ కాలనీలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి, పాలిలోని రణవాస్ స్టేషన్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ సలీం పఠాన్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్దుల్ తన భార్య, ఇద్దరు పిల్లలు తన అత్తమామలతో కలిసి మేన కోడలి వివాహ వేడెక్కి హాజరయ్యాడు. శనివారం అబ్దుల్ మేనకోడలి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు.. అబ్దుల్ మ్యూజిక్ నైట్ వేదికపై డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కొన్ని క్షణాల్లో మరణించాడు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి.. అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
Read Also: Vishnu Priya : విష్ణు ప్రియ ఇంట్లో విషాదం.. తండ్రిని కోల్పోయిన బుల్లితెర నటి
#Rajasthan#Dance#death
साली की शादी में नाचते हुए जीजा की स्टेज पर गिरकर मौत… pic.twitter.com/kixpBnNb3w— Sweta Gupta (@swetaguptag) November 13, 2022