NTV Telugu Site icon

Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..

Indore

Indore

తనతో మాట్లాడటం మానేసిన మహిళ ఫ్లాట్‌కు నిప్పంటించాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాగా.. ఆ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ ధకేటా (32) అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కెపి యాదవ్ తెలిపారు.

Read Also: Delhi: ట్రాన్స్‌జెండర్స్‌కి కేజ్రీవాల్ శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచితం

ఆ తర్వాత మహిళ మీద కోపంతో నిందితుడు ఫ్లాట్‌కు నిప్పు పెట్టాడని పోలీసులు తెలిపారు. అనంతరం.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని మంటలను ఆర్పివేశారు. ఈ దుశ్చర్య మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. కాగా.. బాధిత మహిళ ఆ వ్యక్తితో కొంతకాలం నుంచి మాట్లాడటం మానేసింది.. దాంతో కోపంతో ఈ దురాఘాతానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

Read Also: Duddilla Sridhar Babu : కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

అంతేకాకుండా.. తన ఫ్లాట్ ను తగలబెట్టానని బాధిత మహిళకు నిందితుడు ఫోన్ లో సమాచారమిచ్చాడు. తీవ్ర పదజాలంతో ఆమెను దూషించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. కాగా.. ఈ ఘటనపై సెక్షన్ 457, 436 ప్రకారం కేసు నమోదు చేసి.. అతనిపై దర్యాప్తు చేపట్టారు.