NTV Telugu Site icon

Viral News: కుమ్మేదాకా వదలనంటున్న ఎద్దు.. భయంతో చెట్టెక్కిన వ్యక్తి

Bull

Bull

మనుషులకు కోపం వస్తుందని అందరికి తెలుసు. కానీ ఎద్దులకు కూడా కోపం వస్తుందా..? అంటే అవుననే అంటున్నారు. యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఎద్దుకు వచ్చిన కోపాన్ని చూస్తే నిజమనే అంటారు. ఓ వ్యక్తిపై ఎద్దు చిర్రెత్తిపోయి.. దాడికి దిగింది. ఎద్దు భయానికి చెట్టెక్కి కూర్చున్నాడు ఆ వ్యక్తి.. అయినా కూడా నిన్ను వదలనంటూ రంకలేసి భయభ్రాంతులకు గురి చేసింది.

Bike Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

కొన్ని ఎద్దులు మనుషులను చూడటంతోనే చిర్రెత్తిపోతాయి. వాటికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ.. ఉరకలేసుకుంటూ వస్తూ.. మీద పడుతాయి. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిపై అక్కడే ఉన్న ఎద్దు దాడి చేసింది. భయంతో ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అతన్ని వదలకుండా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కోపంతో ఊగిపోయింది. అయితే ఆ ఘటన గమనించిన స్థానికులు.. ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎద్దు అదరలేదు బెదరలేదు. అతని పై ఏదో పగపట్టిన మాదిరిగా ఎప్పుడు చెట్టు దిగుతాడా కుమ్మేద్దామన్నట్లు చెట్టు వద్దనే వేచి చూసింది.

SKN: ఆయనకు మా శక్తి తెలియడం లేదు.. అక్కడ బాస్ రా బచ్చా

భయంతో వణికిపోతున్న బాధితుడు.. రెండు గంటల పాటు చెట్టు పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఎద్దు కోపం చల్లారి అక్కడి నుంచి వెళ్లింది. దీంతో బతికి బట్ట కట్టాను రా.. బాబు. ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయి అంటూ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఎద్దు వీరంగం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Show comments