గత కొద్ది రోజులుగా జంతు హింసకు సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని జల్గావ్‌లో అలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జల్గావ్‌లోని పరోలాలో నివసిస్తున్న ఓ వ్యక్తి వీధికుక్కను చంపాడు. ఆ కుక్క చేసిన తప్పు ఏంటంటే.. ఆ వ్యక్తి యొక్క ట్రాక్టర్ సీటును పాడు చేసింది. ట్రాక్టర్ సీటు నాశనం చేయడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి కుక్కకు హృదయ విదారకమైన శిక్ష విధించాడు.
Read Also: IND vs PAK Live Updates: భారత్-పాక్ మ్యాచ్.. ఆగిపోయిన వర్షం, మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు
ఆ వీడియోలో కుక్క మెడకు తాడు బిగించి ట్రాక్టర్‌కు ఉరివేసాడు. దీంతో ఆ కుక్క మృతి చెందగా.. ఈ ఘటన అందరు చూస్తుండగానే ఈ నేరానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో ఉన్న పలువురు అతను చేసిన చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనను సమీపంలో ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఈ జంతు హింసకు సంబంధించిన వీడియోను ‘ఫైట్ ఎగైనెస్ట్ యానిమల్ క్రూయెల్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: CPI Narayana: చంద్రబాబు అరెస్ట్ పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఈ వీడియోను చూసిన చాలా మంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు వినియోగదారులు ఆ వ్యక్తి చేసిన పనికి తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక వినియోగదారు ఇలా అన్నాడు. అలాంటి వారికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయరు. రెండు రోజులు మాట్లాడాక అందరూ సైలెంట్ అయిపోయారని తెలిపాడు. మరో వినియోగదారు ఏమన్నాడంటే.. ఈ మనిషికి సిగ్గు లేదు.. అతను ఎంత తప్పు చేశాడో కూడా అర్థం కావడం లేదన్నాడు.