Site icon NTV Telugu

Prize Money: కోట్లు గెలిచాడు.. సంతోషంలో గుండెపోటుతో పోయాడు..

Viral

Viral

Prize Money: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తిసేవరకు కొడుతుందని ఓ సామెత ఉంది. ఈ సామెత మాదిరిగానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. కానీ ఆయన దాన్ని అనుభవించే అదృష్టం పొందలేకపోయాడు. జననానికైనా.. మరణానికైనా.. ఒక్క కనురెప్పపాటు సమయం చాలు. ఆ సమయంలోనే ధనవంతుడు బిచ్చగాడు కాగలడు., అలాగే బిచ్చగాడు ధనవంతుడు కూడా అవుతాడు. ఇలాంటి సంఘటన సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా ఇలాంటి ఓ విషాద సంఘటన సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

CM Revanth: కేంద్రమంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

ఓ వ్యక్తికి అదృష్టం వరించి క్యాసినోలో నాలుగు మిలియన్ డాలర్లు జాక్పాట్ కొట్టాడు. ఇది భారతీయ కరెన్సీలో 33 కోట్ల రూపాయలకు సమానం. అంత భారీ మొత్తంలో డబ్బులు గెలిచిన ఆనందాన్ని అతడు చాలాసేపు అనుభవించలేకపోయాడు. సంతోషంతో ఉబ్బితబ్బిపోయిన ఆయనికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో అక్కడికక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కేసిన్ గ్యాంబ్లింగ్ లో భారీ జాక్పాట్ కొట్టిన ఉత్సాహంతో అతడు గుండెపోటుకో గురయ్యాడు. ఈ సంఘటన సింగపూర్ లోని మెరీనా బే కేసిన్ లో చోటుచేసుకుంది. అదృష్టం వరించింది కానీ.. దాన్ని అనుభవించే అదృష్టాన్ని మాత్రం ప్రసాదించలేదు ఆ దేవుడు. అందుకే అనేది ప్రతిక్షణం ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ఎంజాయ్ చేయాలని.

Exit mobile version