khiladi lady: ఆడవాళ్లు అన్నింట్లో సమానం అంటూ నేటి సమాజంలో దూసుకుపోతున్నారు. అలాగే క్రైం విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు చేసేస్తున్నారు. అలాంటి కిలాడీ లేడీ ఇప్పుడు విశాఖలో చర్చనీయాంశంగా మారింది. మగవారేనా మోసం చేసేది… మేము చేయగలం అన్నట్లు ఒకరిని కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకుని మోసగించింది. డబ్బున్న వారిని గుర్తించడం వారి చెంత చేరి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని వదిలేయడం పరిపాటిగా మార్చుకుంది. గుంటూరు, భీమవరం, శారదనగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన పలువురిన ఈమె మోసగించింది.
Read also: Pocso Court: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్ష
తాజాగా ఈమె బారిన పడ్డ కొత్తకోట నాగేశ్వరరావు అనే వ్యక్తి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రోకళ్ల వెంకటలక్ష్మి అలియాస్ కందుకూరి నాగలక్ష్మి తన వద్ద పనికి చేరింది. దీంతో అతనితో చనువు పెంచుకుని 2021 మార్చి 31న గుంటూరులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం చేరుకుని జగదాంబ జంక్షన్ సమీపంలో కాపురం పెట్టారు. నాగేశ్వరరావు ఓ కంపెనీలో ఆడిటర్ గా చేరాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు నమ్మి ప్రతినెలా జీతం ఆమెకే ఇచ్చేవాడు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అంతా.. గుంటూరు జిల్లా గోరింట్ల వద్ద ఇళ్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకూంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలాన్న వెంకటలక్ష్మి తన పేర రాయించుకుంది.
తను గర్భం దాల్చిన సమయంలో మూడు తులాల బంగారం, బ్యాంకులో సొమ్ముతో నాగేశ్వరరావును వదిలిపోయింది. ఈ విషయంపై గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె గతంలో చేసిన మోసాలన్నీ వెలుగులోని వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, గుంటూరులో ముగ్గురు, విజయవాడలో ఒకరు ఆమె బారిన పడినట్లు తెలిసింది. వీరిలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఉన్నట్లు విచారణలో తేలింది.