NTV Telugu Site icon

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవల్ గా శరత్ చంద్రారెడ్డి

Ed

Ed

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ లో ముఖ్య సభ్యుడు శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆయన రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అప్రూవర్ గా మారుతున్నందుకు అనుమతివ్వాలంటూ కోరాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనుమతులు మంజూరు చేసింది. దానితో పాటు తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లేలా ఈడీకి నోటీసులు జారీ చేసింది.

Also Read : Deepika Ranbir: మళ్లీ కలిసిన మాజీ ప్రేమికులు…

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు ముడుపులు అందాయని.. వీటిలో రూ.30 కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా మార్గంలో దిల్లీకి చేరాయని దర్యా్ప్తు సంస్థలు తెలిపాయి. మిగతా రూ.70 కోట్లు దిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నట్లు.. దీంతో పాటు దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు కోర్టుకు తెలిపాయి సీబీఐ, ఈడీ. శరత్‌ చంద్రారెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సమయంలోనూ ఈడీ అనేక కీలకమైన విషయాలను ప్రస్తావించింది. అంతేకాకుండా హైదరాబాద్‌, దిల్లీలో జరిగిన సమావేశాలతో పాటు కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన భేటీల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు.. వీటన్నింటిలోనూ శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు కోర్టులో ప్రస్తావించాయి.

Also Read : GHMC: లైగికంగా వేధించిన సూపర్ వైజర్.. పారిశుధ్య కార్మికులు ఆందోళన

శరత్‌ చంద్రారెడ్డిని వారం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. నవంబర్‌ 11న అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తదుపరి కోర్టులో హాజరుపర్చగా.. తిరిగి ఈడీ తమ అదుపులోకి తీసుకుని శరత్‌ చంద్రారెడ్డిని వారం, పది రోజుల పాటు ప్రశ్నించింది. అనంతరం జైలుకు పంపించారు. జైలుకు పంపించిన రెండ్నెళ్ల తర్వాత తమ బంధువు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బెయిల్‌ మంజూరు చేయాలని శరత్‌చంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ గడువు పూర్తికావస్తున్న తరుణంలోనే తన భార్య ఆరోగ్యం బాగాలేదని.. అందుకు అనుగుణంగా బెయిల్‌ ఇవ్వాలని శరత్‌చంద్రారెడ్డి కోరగా.. వీటిని పరిగణనలోకి తీసుకుని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ శరత్‌ చంద్రారెడ్డి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాము ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే బెయిల్‌ మంజూరు చేస్తున్నామని… కోర్టుకు విధించిన షరతులకు లోబడే వ్యవహరించాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పూర్తి చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

Show comments