NTV Telugu Site icon

Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం.. ఈ ఓటీటీ క్లోజ్ ?

Ott

Ott

Top OTT Platform : ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. అన్నీ హిట్లు కావు. కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. ఏదోక పాయింట్ నచ్చక జనాలు ఆ సినిమాను రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో సినిమా భారీ ఫ్లాప్ ను మూటకట్టుకుంటుంది. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకుంటాయి. ఇక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన ఏదో ఒక ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఓటీటీ సంస్థలు సినీ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ ఓటీ టీ సంస్థ లో భారీ స్కాం బయటపడిందని, త్వరలోనే ఆ ఓటీటీ సంస్థ కనుమరుగు కానుందన్న వార్తలు వినిపిస్తు్న్నాయి.

Read Also:IND vs BAN: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆలౌట్‌.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమా కూడా ఓటీటీ లో సందడి చేయడం లేదు. అయితే తాజాగా ఓ ఓటీటీ సంస్థను బ్యాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ పై కన్నెర్ర చేసిన ఓటీటీ సంస్థ చాలా అవకతవకలకు పాల్పడింది. గతేడాది చివరలో దాదాపు అన్ని సినిమాలు ఒప్పందం చేసుకున్న, వ్యక్తులకి పెద్దలకు మరి ప్రొడ్యూసర్స్ కి చెడిందా? లేక సినిమాల రిజల్ట్ ను బట్టి కొత్త సినిమాలను చూసి ఆచితూచి కొంటుందా? ఈ బడ్జెట్ అయిపోయిందని చెప్పేసి ఊరికే అబద్దమా ఆడుతుందా.. మొత్తానికి టాలీవుడ్ లో పెద్ద స్కామ్ జరిగిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.. గతంలో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్న సినిమాలకు పక్కన పెట్టడమే అసలు కారణమన్న వార్తలు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి అతి పెద్ద స్కామ్ వెలుగు చూసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో నిజా నిజాలు తెలియలేదు కానీ ఈ వార్త మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

Read Also:Sunitha Returns: సునీతా విలియమ్స్ రాకకు వేళాయే..!!

రెండేళ్లలో ప్రముఖ కంపెనీల నుండి ప్రముఖ ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి చాలా సినిమాలు డైరెక్ట్ గా కొనుగోలు చేసిన ఓటీటీ కంపెనీ.. ఒక తెలుగులోనే 300 నుండి 600 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసిన పోటీలో కంపెనీ చాలా సినిమాలు తీసుకున్నా ఒక సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు.. ఈ ప్లాట్ ఫాంలోనే స్టార్ హీరోల సినిమాలు విడుదలై ఓ మాదిరి టాక్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్య అనుకున్న సమయానికి సినిమాలను రిలీజ్ చెయ్యక పోవడమే దీనికి అసలు కారణం. మరి దీనిపై ఆ సంస్థ ఏదైన క్లారిటీ ఇస్తుందా ?లేక పూర్తిగా దుకాణం సర్దుకుంటుందో చూడాలి..

Show comments