Site icon NTV Telugu

Tamilnadu : తమిళనాడులో భారీ పేలుడు..

Tn

Tn

తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మూడు లారీల్లో ఒకదానికొకటి వెనువెంటనే మంటలు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పోగా కమ్ముకున్నాయి. గోడౌన్ లో లారీని ఎక్కించే టటువంటి కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరకున్న ఐదు ఫైరింజలతో మంట ఆర్పుతున్నారు.

READ MORE: AP CM Chandrababu: ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఇదిలా ఉండగా.. ఇదే నెల ఒకటిన తమిళనాడు తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు. పటాకులను ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, వారిని కన్నన్, విజయ్‌లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నలుగురిని చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్లీ పేలుడు సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Exit mobile version