NTV Telugu Site icon

Clashes at Football match: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఫ్యాన్స్ మధ్య భారీ ఘర్షణ.. 100 మంది మృతి!(వీడియో)

Clashes At Football Match

Clashes At Football Match

పశ్చిమాఫ్రికాలోని గినియాలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అభిమానులు తమలో తాము ఘర్షణ పడ్డారు. ఇందులో 100 మందికి పైగా మరణించారు. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరె నగరంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని స్థానిక ఆసుపత్రి వర్గాలు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కి తెలిపాయి. ఈ ఘటనపై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. “కంటి చూపు మేర మృతదేహాలు పడి ఉన్నాయి. ఆసుపత్రిలో మృతదేహాల క్యూలు భారీ కనిపించింది. స్థలం సరిపోక కొన్ని శవాలను కారిడార్‌లలో నేలపై ఉంచారు. మార్చరీ నిండిపోయింది. ” అని పేర్కొన్నారు.

READ MORE: Attack on Constable: మహిళా కానిస్టేబుల్‌ను చితకబాదిన యువకుడు.. కింద పడేసి మరీ.. (వీడియో)

2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని తనను తాను అధ్యక్షుడిగా నియమించుకున్న గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్‌ నిర్వహించారు. రెఫరీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి అనంతరం అభిమానులు స్టేడియం బటకు వచ్చి దాడులకు పాల్పడ్డారు. పలు పోలీస్ స్టేషన్‌లను నిప్పు పెట్టారు. రోడ్లపై కూడా మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ MORE:SI Suicide: వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్.. మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత రోజే ఘటన

Show comments