NTV Telugu Site icon

J-K: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి..

J K

J K

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. ప్రధాన శ్రీనగర్‌లోని టీఆర్‌సీ కార్యాలయం సమీపంలోని ఆదివారం మార్కెట్‌లో ఈ దాడి జరిగింది. మార్కెట్‌లో ఉన్న జనం ఈ పేలుడులో 10 మంది గాయపడినట్లు సమాచారం. ఒక రోజు ముందు, ఖన్యార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి.

READ MORE: Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

జమ్మూకశ్మీర్‌లో వరుసగా రెండో రోజు శనివారం కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరిగాయి. శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లు వేర్వేరు చోట్ల జరిగాయి. మొదటి ఎన్‌కౌంటర్ శ్రీనగర్‌లో జరగగా, రెండోది అనంతనాగ్‌లో జరిగింది. ఇందులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్ టాప్ కమాండర్, మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉస్మాన్‌గా గుర్తించబడిన ఎల్‌ఇటి కమాండర్ దశాబ్ద కాలంగా కాశ్మీర్ లోయలో చురుకుగా పనిచేశాడని.. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వానీ హత్యలో కూడా ప్రమేయం ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గతేడాది అక్టోబరులో ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతూ మస్రూర్ వానీని అతి సమీపం నుంచి కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

READ MORE:RK Roja: సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

Show comments