Site icon NTV Telugu

PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. 36 గంటల్లో 5,300 కి.మీ

Modi

Modi

PM Modi : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏడు నగరాల మీదుగా 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ క్రమంలోనే ఆయా నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను శనివారం పీఎంవో అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రారంభమై మంగళవారం దమణ్‌ పర్యటనతో ముగుస్తుంది. తొలుత సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని బయలుదేరుతారు. 500 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖజురహో చేరుకుంటారు. అక్కడి నుంచ రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. తర్వాత మళ్లీ ఖజురహోకు వస్తారు. తరువాత 1,700 కి.మీ ప్రయాణించి కొచ్చిలో జరగనున్న యువమ్‌ సదస్సుకు హాజరవుతారు.

Read Also: Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం

మంగళవారం ఉదయాన్నే కొచ్చికి 150 కిలోమీటర్ల దూరంలోని తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వే స్టేషన్ కు వెళ్లి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రూ.3,200 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. తిరువనంతపురం నుంచి 1570 కిలోమీటర్లు ప్రయాణించి సిల్వాసాకి వెళతారు. దాద్రా, నగర్ హవేలీలో నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దమణ్‌కు వెళ్లి.. డేవ్కా సీఫ్రంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి సూరత్‌ మీదుగా తిరిగి ప్రధాని రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు.

Read Also: Srikakulam : సాయంగా ఉంటాడనుకుంటే.. సక్కగా పెళ్లాంనే లైన్లో పెట్టాడు.. తట్టకోలేక చంపి పాతేశాడు

Exit mobile version