NTV Telugu Site icon

Heart Attack For Student: తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్‌తో కుప్ప కూలిన బాలిక (వీడియో)

Heart Attack

Heart Attack

Heart Attack For Student: గత కొద్దికాలం నుంచి అనేకమంది గుండెపోటు కారణంగా ఉనట్లుండి మరణిస్తున్నారు. అప్పటివరకు, అందరిలాగే మనతోపాటు సంతోషంగా గడిపిన వారు మరొక క్షణంలో పరలోకానికి చేరుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా కరోనా సమయం ముగిసిన తర్వాత ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాయమాలు చేస్తున్న సమయంలో, అలాగే వారి దైనందిక జీవితంలో బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉన్నచోటే కుప్పకూలిపోతున్న ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది పెద్దవారు మృతి చెందడం కాకుండా అక్కడక్కడ చదువుకుంటున్న పిల్లలు, యువత కూడా ఉండడం ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటన తాజాగా తమిళనాడు రాష్ట్రంలో సంభవించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Strange Incident : మేకల్​ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన.. నేలపై అమ్మవారి పాద ముద్ర ప్రత్యక్షం

తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట నగరంలో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని అద్విత గుండెపోటు కారణంగా మరణించింది. క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయురాలు పాఠం చెబుతున్న సమయంలో ఉన్నటువంటి బాలిక ఒకసారిగా తన తోటి విద్యార్థి పై వాలిపోయింది. దాంతో సదరు అమ్మాయి వెంటనే ఉపాధ్యాయురాలికి విషయం చెప్పగా ఆమె బాలికను పరీక్షించింది. ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే, అమ్మాయి ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అమ్మాయికి గుండెపోటు రావడం సంబంధించిన సమయంలో క్లాస్ రూమ్ లో ఉన్న సిసిటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: M Jethamalani: జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్, సోనియా గాంధీ అపవిత్ర బంధం..