NTV Telugu Site icon

Fire Accident: స్కూల్ అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి గాయలు..

Fire Accident

Fire Accident

Fire Accident: కెన్యా దేశంలోని నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా కాలిపోయారు. అక్కడి పాఠశాలలోని వసతి గృహంలో గురువారం రాత్రి మంటలు ఒక్కసారిగా పెద్దెత్తున చెలరేగాయి. ఇకపోతే ఈ విషాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఇక ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. “మేము కారణాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని ఒయాంగో తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది. కెన్యా బోర్డింగ్ పాఠశాలల్లో మంటలు దురదృష్టవశాత్తూ జరిగి ఉండకపోవచ్చని., తరచుగా విద్యార్థులు తమ పనిభారం లేదా జీవన పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల సంభవించినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది.

Raj Tarun : లావణ్య కేసులో రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..?

కెన్యా బోర్డింగ్ పాఠశాలల్లో మంటల చరిత్ర ఒకసారి చూస్తే.. కెన్యా బోర్డింగ్ పాఠశాలల్లో అగ్నిప్రమాదాల ప్రాబల్యం గణనీయమైన ఆందోళన కలిగిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ స్కూల్స్ లో చేర్పించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే., వారు సుదీర్ఘ ప్రయాణాలు లేకుండా ఎక్కువ అధ్యయన సమయాన్ని పొందుతారని. అయినప్పటికీ, కొంతమంది విద్యార్థులు అధిక పనిభారం లేదా పేద జీవన పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసనగా మంటలను ఆశ్రయిస్తుంటారు. 2017లో కెన్యా రాజధాని నగరం నైరోబీలో పాఠశాల అగ్నిప్రమాదంలో 10 మంది హైస్కూల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.