Site icon NTV Telugu

Farmer Chinnikrishnudu : తల్లిదండ్రులకు ఘన నివాళి.. ఎకరం భూమిలో తల్లిదండ్రుల బొమ్మలతో..

Farmer Chinnikrishnudu

Farmer Chinnikrishnudu

కళకేదికాదు అనర్హం అన్నమాట వినే ఉంటాం. అయితే.. ఓ రైతు.. తన తల్లిదండ్రులకు ఘన నివాళి అర్పించాడు. తన తల్లిదండ్రుల బొమ్మలను పలు రకాల వరి విత్తనాలతో తీర్చిదిద్దాడు. ఇది ఆకాశం నుండి లేదా డ్రోన్ లెన్స్ ద్వారా మాత్రమే చూడగలిగే తన తల్లిదండ్రులకు రైతు నివాళి. నిజామాబాద్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న చింతలూరు గ్రామంలో నివసించే గంగారాం చిన్ని కృష్ణుడు అనే రైతు తన వ్యవసాయ భూమిలోని ఒక ఎకరం భూమిలో తన తల్లిదండ్రుల చిత్రాన్ని రూపొందించడానికి మూడు రకాల వరి విత్తనాలను ఉపయోగించాడు. ‘నా తల్లిదండ్రులు 21 ఏళ్ల క్రితం చనిపోయారు. వాళ్లు నన్ను 6వ తరగతి వరకు చదివించారు, వాళ్లను గుర్తుపెట్టుకుని ప్రపంచానికి చాటిచెప్పడం ఇదే నా ప్రయత్నం’ అని చిన్ని కృష్ణుడు అన్నారు. తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి, చిన్ని కృష్ణుడు పొలం చుట్టూ లేత గులాబీ రంగు అంచుని సృష్టించడానికి మూడు రకాల వరిని ఉపయోగించాడు.

 

తన తల్లిదండ్రుల ముఖకవళికలకు గుర్తుగా ముదురు గులాబీ రంగు మొక్క, దాని చుట్టూ లేత ఆకుపచ్చని మొక్కలు వినియోగించాడు. తన వ్యవసాయ క్షేత్రంలో 36 రకాల వరి వంగడాలతో నెల రోజులకు పైగా కష్టపడి తన తల్లి భూదేవి, తండ్రి ముత్తన్న చిత్రాలను తీర్చిదిద్ది తన ప్రేమను చాటుకున్నాడు. ఒక నెలలో, అతని తల్లి భూదేవి, తండ్రి ముత్తన్నల రూపురేఖలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత, అతను తన కోసం చిత్రాన్ని పరిశీలించేందుకు రూ.3,500కి డ్రోన్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ డ్రోన్‌తో ఈ ఫోటోను చిత్రీకరించారు. అంతేకాకుండా.. ఈ ఫోటోలను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకున్నారు.

 

Exit mobile version