Site icon NTV Telugu

Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు

New Project (59)

New Project (59)

రైతే రాజు అని చెబుతుంటే వింటుంటాం. ఓ వీడియోలో ప్రత్యక్షంగా చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పశువులకు మోత తీసుకెళ్లేందుకు సాధారణంగా రైతులు ఎద్దులబండి, రిక్షాలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పోర్షే లగ్జరీ కారులో పశువులకు గడ్డి తరలిస్తున్న ఓ మహిళ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ. 1.5 కోట్ల విలువైన పోర్షే 718 బాక్స్‌స్టర్ కారులో ఓ రైతు గడ్డిగడ్డిని తీసుకెళ్తున్నారు. ఓ మహిళ ఇంత ఖరీదైన కారును గడ్డి తీసుకురావడానికి వినియోగించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూన్నారు.

READ MORE: Vijay- Rashmika: ఒకే రిసార్టులో దొరికేసిన విజయ్, రష్మిక.. ఫొటోలు చూపిస్తూ ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

కాగా.. ఈ వీడియో ndahiya2021 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయబడింది. ఓ మహిళ రైతు పోర్స్చే బాక్స్‌స్టర్ 718ని నడుపుతున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. రెడ్ కలర్ పోర్షే బాక్స్‌స్టర్ 718 కారు డ్రైవర్ సీటు నుంచి దిగిన ఆ మహిళ హర్యానాలో మోటివేషన్ డైలాగ్ చెబుతుంది. లగ్జరీ స్పోర్ట్స్ పోర్షే కారులో ఎండుగడ్డిని తీసుకొస్తామని, ఆపై సరదాగా ఒక యువకుడిని కొట్టి హే గడ్డిని కారులోంచి దించమని చెబుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. వెనుక డిక్కీలో ఉన్న గడ్డి మోపును దించి.. డిక్కీ క్లోజ్ చేస్తుంది. దీని తర్వాత మరొక వ్యక్తి అక్కడికి వచ్చి కారు వెనుక డిక్కీని సరిగ్గా క్లోజ్ చేస్తాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ మహిళ ప్రతిరోజూ పోర్స్చే నడుపుతున్న ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారులో ఒక మహిళ ఎండుగడ్డిని మోసుకెళ్లడం చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఈ వీడియోని కోటి మందికి పైగా చూసారు. పోర్షే 718 Boxster భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఈ ఇంజన్ 298 bhp, 380 Nmల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కేవలం 4.7 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ ఎలక్ట్రానిక్‌గా 275 kmphకి లిమిట్ చేయబడింది.

Exit mobile version