NTV Telugu Site icon

MS Dhoni: స్టేడియంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని.. ఆటపట్టించిన ఎంఎస్‌డీ

Dhoni

Dhoni

MS Dhoni: గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒక‌రు.. స్టేడియంలోకి దూసుకువ‌చ్చిన అత‌నికి పాదాభివంద‌నం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జరిగింది. లాస్ట్ ఓవ‌ర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని స‌డెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకువ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో ధోనీ క్రీజ్ నుంచి పరుగెత్తతున్నట్లు అతడ్ని కాస్త ఆట పట్టించాడు. అక్కడే ఉన్న ఫీల్డ్ అంఫైర్ కూడా ధోనీ ఫ్యాన్‌ను అడ్డుకునేందుకు ట్రై చేశాడు. కానీ ప‌రుగులు తీస్తూ వ‌చ్చిన ఎంఎస్‌డీ అభిమాని.. ధోనీ ముందు మోక‌రిల్లి.. పాదాభివంద‌నం చేశాడు.

Read Also: The Raja Saab : మరింత ఆలస్యం కానున్న ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్..?

ఇక, మహేంద్ర సింగ్ ధోనీ కూడా అత‌న్ని పైకి లేపి హగ్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత సెక్యూరిటీ సింబ్బంది వచ్చి గ్రౌండ్‌లోకి వ‌చ్చి ఆ అభిమానిని తీసుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తలా క్రేజ్‌, ఫ్యాన్స్‌ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌ట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై 35 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది.