Women Lingerie : అహ్మదాబాద్‌లోని ధంధూకా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇదే జరుగుతోంది. మహిళలు తమ లోదుస్తులను ఆరబెట్టడానికి బయట తాడుకు వేలాడదీయేవారు. ఆ తర్వాత లోదుస్తులు అక్కడి నుంచి మాయమయ్యేవి. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. జూన్ 27న ఆ మహిళ గత ఎనిమిది నెలలుగా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిఘా పెట్టింది. ఎప్పటిలాగానే లోదుస్తులను ఆరబెట్టడానికి లైన్‌లో పెట్టి ఒ కన్నేసింది. ఆ సమయంలోనే ఆమె దొంగతనాన్ని గుర్తించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో పది మంది గాయపడ్డారు. ఈ కేసులో వివాదానికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అత్తాపూర్‌లో పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య
స్థానిక మీడియా ప్రకారం “లోదుస్తులు దొంగిలించబడుతున్నందున మహిళలు షాక్ అయ్యారు. ఆ తర్వాత దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకుంది. మహిళ తన సెల్ ఫోన్ కెమెరాను ఆన్ చేసి అక్కడే దాచిపెట్టింది. లోదుస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగ ఘటన మొబైల్ కెమెరాలో రికార్డైంది. జూన్ 26న మహిళ ఫుటేజీని పరిశీలించిన తర్వాత, ఆమె షాక్‌కు గురైంది. ఆమె పక్కనే దొంగ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు అతను నిఘాలో ఉన్నప్పుడు, అతను లోదుస్తులను దొంగిలించడం కనిపించింది. ఆ మహిళ ఇరుగుపొరుగు వారిని పిలవడంతో నిందితులు మహిళను కొట్టారు.
Read Also:Ileana D’cruz Pregnancy: ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఇతడే.. ఫోటో పెట్టిందోచ్
దీంతో భయపడి మహిళ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు కర్రలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు, అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మహిళ కుటుంబ సభ్యులను కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత విషయం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ధంధూకా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి పిఎన్ జింజువాడియా మాట్లాడుతూ, ‘ఘర్షణలో సుమారు 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఇరు వర్గాలకు చెందిన 20 మందిని అరెస్టు చేశారు. మహిళ కుటుంబసభ్యులపై దాడి కేసు నమోదు చేశారు. నిందితుడి కుటుంబ సభ్యులపై వేధింపులు, కొట్టిన కేసు నమోదు చేశారు.