NTV Telugu Site icon

Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?

Delhi Metro

Delhi Metro

Viral Dance in Delhi Metro: ప్రస్తుతం చాలామంది సగం రోజుని సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. రీల్స్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుండగా.. కొన్నిసార్లు వారు హద్దు మీరడం ద్వారా చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి అనేక ఘటనలలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇకపోతే మరికొందరు ఎవరు ఏమనుకుంటే మాకేంటి.. అన్నట్లుగా పబ్లిక్ ప్రదేశాలలో వారికి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ రీల్స్ చేయడం పరిపాటుగా మారింది. ముఖ్యంగా రోడ్లపై, అలాగే పబ్లిక్ వాహనాలలో రీల్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్న అనేక వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో మరో వీడియో చేరింది.

Hyderabad: భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో యాక్షన్.. సైబరాబాద్ పరిధిలో మొదటిసారి

ఇప్పటివరకు ఢిల్లీ మెట్రోకు చెందిన అనేక డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ఆయన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై నగరంలో పోలీసులకు క్షమాపణ చెప్పి నా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో తన స్టైల్ లో డాన్స్ చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. వైరల్ వీడియోలో ఓ అమ్మాయి భోజపురి పాటకు చేస్తూ కాస్త అశ్లీలంగా ప్రవర్తించిందని చెప్పవచ్చు. దాంతో అక్కడ ఉన్న కొందరు ప్రయాణికులు అమ్మాయి డాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ వీడియో మహిళ కోచ్ లో చిత్రీకరణ చేసినట్లుగా కనబడుతుంది. ఆమె రీల్ చేసిన సమయంలో మెట్రోలో పెద్దగా జనాలు కనపడలేదు. భోజపురి పాటకు డాన్స్ చేసి చివర్లో ఆ అమ్మాయి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దింతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్.

AI Fashion Show : ఫ్యాషన్ షోలో దేశాధినేతల ర్యాంప్ వాక్.. మాములుగా లేదుగా..

ఇదివరకు అదే అమ్మాయి ముంబై నగరంలో మెట్రోలో ఇలా నృత్యం చేసి చివరికి ముంబై పోలీసులతో చివాట్లు తినింది. చివరకు ముంబైలో పోలీసులకు చెప్పి.. తాజాగా యువతీ ఢిల్లీ మెట్రోలో మళ్లీ ఇలా ప్రవర్తించడంతో నెటిజన్స్ ఆ అమ్మాయిపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలను ఒక్క రోజైనా సరే జైల్లో ఉంచాలని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే., చుట్టుపక్కల ఉన్నవారు దానిపై రియాక్ట్ కానంత వరకు ఇలాంటివారు చేసే పనులు చేసేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments