వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Read Also: Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..
రుస్మితా సాయి 18 నెలల పాపపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం బాలుడిని నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్రామంలో ఇలాంటి ఉదంతాలు జరిగాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Copying in Group-1: గ్రూప్-1 పరీక్షల్లో కాపీయింగ్.. సెల్‌ఫోన్‌లో చూసి ఎగ్జామ్ రాస్తుండగా..
