NTV Telugu Site icon

Meghalaya: చర్చిలోకి ప్రవేశించి “జై శ్రీరామ్” నినాదాలు చేసిన యువకుడు.. చివరికీ..

Meghalaya

Meghalaya

చర్చిలోపల ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్‌పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సాగర్ వీడియోలు తనకు కనిపించాయని ఫిర్యాదుదారు తెలిపారు. వీడియోలో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. మతపరమైన పవిత్రతను దెబ్బ తీయడం కనిపించిందన్నారు. ఈ మేరకు రంగద్ గురువారం లైతుంఖర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

READ MORE: Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై వరుణ్ ధావన్ వివరణ

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. “ఆకాశ్ సాగర్ చర్చిలోకి ప్రవేశించి క్రైస్తవ వ్యతిరేక నినాదాలు చేశాడు. అంతే కాకుండా చర్చిలో క్రైస్తవేతర పాటలను పాడాడు. ఉద్దేశ పూర్వకంగానే ఇది జరిగింది. వీడియో ప్రకారం మరి కొంత మంది కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. మత విద్వేషాన్ని సృష్టించడం, మైనారిటీ సంస్కృతిని అవమానించడం, మత స్వేచ్ఛకు సంబంధించిన అన్ని రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించారు.” అని పేర్కొన్నారు.

READ MORE: Anna University Case: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి.. సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు..

ఈ అంశంపై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ మాట్లాడుతూ.. “ఈ వీడియో ద్వారా మతాల మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉంది. మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహించే హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది నేరపూరిత చర్య. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేశాను. ఈ వీడియోలను డిలీట్ చేయాలి. వీటిని క్రియోట్ చేసిన, షేర్ చేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా ఖాతాలను నిషేధించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి నేరపూరిత ఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.” అని వ్యాఖ్యానించారు.

Show comments