NTV Telugu Site icon

Kurnool: అదుపుతప్పి కారు బోల్తా.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

Road Accident

Road Accident

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. బళ్లారి నుంచి ఆదోని వెళ్తుండగా టైరు పంచర్ కావడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఆదోనికి చెందినవారు కాగా.. గౌస్(మెస్త్రీ), శమీరా, నస్రీన్ గా గుర్తించారు. అయితే.. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments