NTV Telugu Site icon

Lava Shark: లావా ఇంటర్నేషనల్ షార్క్ పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల

Lava

Lava

Lava Shark: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన కొత్త షార్క్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ధలోనే డిజైన్, పెర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ పరంగా మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ ఫోన్ రూపొందించబడింది. ఇక ఈ మొబైల్ ఫీచర్లను చూస్తే..

Read Also: Bank Holidays: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

లావా షార్క్ ఫోన్ 6.67 అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తోంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz కావడంతో స్క్రోలింగ్ మన్నెరు చాలా స్మూత్‌గా ఉంటుంది. భద్రత పరంగా ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ లు కూడా అందించబడ్డాయి. ఈ ఫోన్ UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 4GB RAM తో వస్తుంది. అయితే, అదనంగా 4GB వర్చువల్ RAM కలిగి ఉండడంతో మల్టీటాస్కింగ్ చాలా సులభంగా సాగుతుంది. ఇక ఈ మొబైల్ 64GB స్టోరేజ్ కలిగి ఉంది. దీన్ని 256GB వరకు పెంచుకోవచ్చు.

ఇక ఈ మొబైల్ లో ఫోటోగ్రఫీ కోసం, 50MP AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా అందించారు. ఇందులో AI మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రొ మోడ్, HDR వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు మరింత మెరుగైన ఫోటోలు, వీడియోలు తీయగలరు. ఇక లావా షార్క్‌లో 5000mAh బ్యాటరీ అందించబడింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అందించారు.

Read Also: Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే

ఇక ఈ లావా షార్క్ ఫోన్ ధర రూ. 6,999గా నిర్ణయించారు. ఇది టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, లావా కంపెనీ ఒక సంవత్సరం వారంటీ, ఫ్రీ హోమ్ సర్వీస్ అందిస్తోంది. లావా షార్క్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా మారనుంది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు అందించాలనే లక్ష్యంతో లావా తీసుకొచ్చిన ఈ ఫోన్ వినియోగదారులకు ఉత్తమ ఎంపిక.