NTV Telugu Site icon

Viral Video: రీల్స్‌ చేస్తుండగా తెగిపోయిన తల, మొండెం.. 20ఏళ్ల యువకుడు మృతి

Boy Died

Boy Died

ప్రస్తుత రోజులలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో సరదాగా గడపడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రికి రాత్రికే ఫేమస్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు అయితే, రీల్స్ పిచ్చితో ఎంతటి సాహసానికైనా వెనక అడుగు వేయరు. కొంతమంది ఈ రీల్స్ పిచ్చితో ఎదురయ్యే ప్రమాదాలు, కలిగే ఇబ్బందుల గురించి అసలు పట్టించుకోరు. అచ్చం అలాగే 20 ఏళ్ల యువకుడు రిల్స్ కోసం ట్రై చేస్తూ చివరికి మృతి చెందిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Kishan Reddy: హైదరాబాద్‌ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు..

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రీల్స్ చేసే క్రమంలో యువకుడి తల శరీరం నుంచి వేరు చేయబడింది. కేవలం సెకన్ల వ్యవధిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఐదు మంది యువకులు ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇందులో ఒక ఇద్దరు నేలపై కూర్చొని వారి పని వారు చేసుకుంటున్నారు. మరొక యువకుడు షాప్ షెట్టర్ తెరవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మరొక యువకుడు అక్కడే నిలబడి డాన్స్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు. మరొక యువకుడు రీల్స్ తీస్తున్నట్లుగానే వీడియో ద్వారా స్పష్టంగా కనబడుతుంది. స్లో మోషన్ లో ఒక యువకుడు పాటకు డాన్స్ చేస్తూ తన ఎదురుగా ఉన్న గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోయి అతని తల శరీరం నుండి వేరు అయిపోయింది. తల నుంచి మొండం తెగి అమాంతంగా కింద పడిపోయినట్లు మనం వీడియోలో చూడవచ్చు.

అక్కడ ఉన్న యువకులు కాపాడేందుకు ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆ యువకుడు తల శరీరం నుండి విడిపోవడం జరిగింది. ఇక ఆ యువకుడు మృతదేహం నాలుగోవ అంతస్తు నుంచి మూడో అంతస్తుకు కిందకు పడిపోయింది. అక్కడి స్థానికుల సమాచారం మేరకు.. 10 గంటల సమయంలో ఆ యువకులంత దుకాణం తెరిచేందుకు వచ్చినట్లు సమాచారం. అంతలోనే ఊహించని విధంగా యువకుడు మృతి వతపడ్డాడు. మృతి చెందిన యువకుడు పేరు అసిఫ్ గా గుర్తించారు. ఆసిఫ్ అబాద్ నగర్ పోలీస్ స్టేషన్ తాజంగంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని.. ఆసిఫ్ నవంబర్ బండిలోని నగల దుకాణంలో పని చేస్తూ జీవనోపాధి చేస్తున్నట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

Show comments