ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఇవాళ మరో బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ లో లక్నో వేదికగా ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ తాడోపేడో తెల్చుకోవాడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇక గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అదే జోరును లక్నోపై కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. కాగా లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ముంబై అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
Also Read : Temperatures : భానుడి భగభగ.. నిప్పుల కొలిమిలా ఏపీ..
ఈ క్రమంలో హృతిక్ షోకీన్ ముంబై ఇండియన్స్ తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ తిలక్ వర్మ తుది జట్టులోకి వస్తే నేహాల్ వధేరా బెంచ్‌కే పరిమితమమ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్లో ముంబై 12 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచి 14 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి 13 పాయింట్లతో ఉన్నాయి. అయితే గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కు మరింత చేరువ కానుంది.
Also Read : DK Shivakumar: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. డీకే శివకుమార్ క్లారిటీ..
తుది జట్ల అంచనా :
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, కె గౌతమ్, యుధ్వీర్ చరక్/యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండార్ఫ్
