Site icon NTV Telugu

Camel on Car: ఇదేందయ్యా ఇది.. కారుపై ఒంటె ఇలా ఐపోయింది..

Camel

Camel

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్‌ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా విడిపించగలిగారు. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

Madhyapradesh : ప్రపంచంలోనే ఖరీదైన మామిడి దొంగతనానికి వచ్చిన దొంగలను తరిమిన కుక్కలు

కారు ఢీకొనడంతో అద్దాలు పగిలిపోగా, ముందు సీట్లు ధ్వంసమయ్యాయి. తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఢీకొన్న ఒంటెను కారు నుండి బయటకు తీయక పోవడం గమనించదగ్గ విషయం. సాధారణంగా చీకటిలో వాహనాలను హెచ్చరించడానికి రేడియం స్టిక్కర్లను అమర్చారు. అయితే అవి సరిగా లేకపోవడం వల్ల ఢీకొనడానికి దారితీసింది. ఎందుకంటే కారు ఒంటె వెనుక భాగంలో ఢీకొని కారు బానెట్‌పైకి ఎక్కింది.

Ramoji Rao: రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు

Exit mobile version