Death Celebrations: ఓ మహిళ చనిపోయింది.. అందరూ విషాదంలో ఉన్నారు.. కొందరైతే ఆగకుండా కన్నీళ్లుపెట్టుకుని ఏడుస్తున్నారు. ఇంతలో ఆ గుంపులోనుంచి ఓ నలుగురు లేచి ముందుకు వచ్చారు. డెత్ ప్రిపరేషన్స్ ఏమైనా చేస్తారేమో అనుకున్నారంతా. కానీ సడన్ గా డ్రస్సులు మార్చుకుని డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు. అంతా దిగ్ర్బంతి చెందారు.. ఏం జరుగుతుందో తెలియక అందరూ షాక్ కు గురయ్యారు. తీరా విషయం తెలుసుకున్నాక.. అయ్యో అంటూ నిట్టూర్చారు.ఇంతకీ అక్కడేం జరిగిందంటే.. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన శాండీ వుడ్ తన 65ఏళ్ల వయసులో మరణించింది. తాను మరణించేకంటే ముందే డ్యాన్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురిచేసేలా డ్యాన్స్ ట్రూప్‌ని సిద్ధం చేసి చనిపోయింది.
Read Also: Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 45 మంది మృత్యువాత!
మృత్యువును సహజంగా చూసేవాళ్లు ప్రపంచంలో చాలా తక్కువ.కానీ ఎంత మంది ప్రజలు తమ మరణాన్ని తమ స్వంతంగా జరుపుకోవాలని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారని చూస్తారు? అలాంటి వారిలో ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన శాండీ వుడ్ కూడా ఒకరు.పెళ్లిళ్లకు, పుట్టినరోజులకు సర్ ప్రైజ్ లు సిద్ధం చేసుకోవడం చూశాం. కానీ, వారి మరణానంతరం వారి బంధువులు, స్నేహితులను షాక్ చేయాలని చూసింది శాండీవుడ్.ఈ క్రమంలోనే ఆమె మరణానంతరం డ్యాన్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురిచేసేలా డ్యాన్స్ ట్రూప్‌ని సిద్ధం చేసి మృత్యువాత పడింది.మనిషి చనిపోయిన సందర్భంలో ఇలాంటివి జరిగితే జనాలు ఎంత ఆశ్చర్యపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.శాండీకి మౌత్ క్యాన్సర్ వచ్చింది. అయితే, ఆమె ఎప్పుడు చనిపోతుందో కచ్చితంగా తెలియడంతో మరణానంతర కర్మ కార్యక్రమాలు రంగులమయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శాండీ సర్ ప్రైజ్ గా డ్యాన్స్ చేసేందుకు చాలా మందిని సంప్రదించింది. అయితే, దాదాపు పది నృత్య బృందాలు శాండీ కోరికను అంగీకరించలేదు. మరణానంతర వేడుకలో తాను డ్యాన్స్ చేయలేనని చెప్పారు.చివరగా,సోషల్ మీడియా ద్వారా చూసిన ఫ్లేమింగ్ ఫెదర్స్ అనే బృందం డ్యాన్స్ చేయడానికి అంగీకరించింది.
Read Also: Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మరణాన్ని జీవితంలా జరుపుకోవాలని శాండీ కోరుకుంది. ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరూ చిరునవ్వుతో తనను గుర్తుపెట్టుకోవాలని శాండీ కోరుకుంది.అదేవిధంగా 10 లక్షల రూపాయలు వెచ్చించి సన్నాహాలు చేసింది.శవపేటికను శాండీకి ఇష్టమైన బ్యాగులు,బూట్లతో తయారు చేయబడింది.ఏది ఏమైనా అంత్యక్రియలు చూసిన వారికి చిరునవ్వుతో శాండీ గుర్తుకు రావడం ఖాయం.