NTV Telugu Site icon

Illegal Affair: 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్..

Up

Up

30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ అదృశ్యమైన ఘటన యూపీలోని భాదోహిలో చోటు చేసుకుంది. బీజేపీ తరపున చైర్మన్ ఎన్నికకు పోటీ చేసిన ఓ బీజేపీ నాయకురాలిగా గుర్తించారు. అయితే.. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కానిస్టేబుల్‌తో కలిసి జంప్ అయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. తనతో పాటు తన కొడుకును తీసుకుని పారిపోయింది. భర్త కూడా బీజేపీ నాయకుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో నుంచి రూ.2.5 కోట్ల విలువైన నగలు, నగదు తీసుకుని తన భార్య కానిస్టేబుల్‌తో కలిసి పారిపోయిందని భర్త ఆరోపించాడు. కానిస్టేబుల్ తన భార్యను డబ్బు కోసం లొంగదీసుకున్నాడని భర్త తెలిపాడు. భార్యకు 45 ఏళ్లు, కానిస్టేబుల్‌కు 30 ఏళ్లు అని భర్త చెప్పాడు. కాగా.. భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh: వరద బాధితులకు పరిహారం ప్యాకేజీపై ప్రభుత్వం ఉత్తర్వులు

ఏడాది క్రితం.. కానిస్టేబుల్ వినయ్ తివారీ అలియాస్ రాజ్ తివారీ తన ఇంట్లో అద్దెకు దిగాడని భర్త పోలీసు ఫిర్యాదులో తెలిపాడు. కొన్ని అసభ్యకరమైన ఫోటోలు తీసి తన భార్యను బ్లాక్‌మెయిల్ చేశాడని.. నోరు విప్పితే అందరినీ చంపేస్తానని బెదిరించానని చెప్పాడు. ఈ విషయం తెలియగానే కానిస్టేబుల్‌ను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో.. అతను తమపై పగ పెంచుకున్నాడని.. అప్పటి నుంచి తన భార్యను ప్రలోభపెట్టి అతనితో తీసుకెళ్లాడని తెలిపాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.. దీన్ని అవకాశంగా తీసుకుని వెళ్లేటప్పుడు సుమారు రెండు కోట్ల రూపాయల నగలు, నాలుగు లక్షల రూపాయల నగదు, ఇతర వస్తువులను తీసుకెళ్లారని అన్నాడు. తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకెళ్లిందని.. వారి కోసం వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. కాగా.. తన భార్య వద్ద ఉన్న బంగారం, నగదును మొత్తం తీసుకుని భార్య, బిడ్డను చంపేసే అవకాశం ఉందని భర్త పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని భర్త ఆరోపించాడు.

Breaking News: పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?